టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి క్రేజ్ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా పాకిపోయింది. రాజమౌళితో సినిమాలు చేసేందుకు ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరోలు సైతం క్యూలో ఉండాల్సిన పరిస్థితులు వచ్చాయి. ఇక రాజమౌళి విజయాల్లో ఎప్పుడూ వెన్నంటే ఉంటుంది ఆయన భార్య రమా రాజమౌళి. రాజమౌళి స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా నుంచి నేటి బాహుబలి, ఆర్.ఆర్.ఆర్ సినిమా వరకు కాస్టూమ్స్ విషయంలో ఆమె ఎంతో కేర్ తీసుకుంటుంది. ఇక రాజమౌళి మాత్రం షూటింగ్లో ఎంత బిజీగా ఉన్నా ఆమె చేతి వంట మాత్రమే తీసుకుంటాడట.
ఇక సినిమాల డిజైన్స్ చాలా బాగుందన్న ఎక్స్ప్రెషన్స్ రమా నుంచి రాకపోతే మేం ముందుకు వెళ్లలేం.. ఆమె ఫేస్తోనే ఆ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చేస్తుందని రాజమౌళి తాజా ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇక తనకు సంబంధించి ప్రతి విషయాన్ని ఆమె ఎంతో దగ్గరుండి చూసుకుంటుందట. రాజమౌళి బయటకు వెళ్లేటప్పుడు జేబులో డబ్బులు కూడా పెట్టుకోకుండా వెళ్లిపోతాడట. ఇలా తమ ఇద్దరి మధ్య ఈ తరహా సంఘటనలు జరుగుతాయని అటు రాజమౌళి, ఇటు రమా ఎన్నోసార్లు చెప్పారు. ఇక రాజమౌళిని పెళ్లాడే ముందు రమా రాజమౌళికి మరో వ్యక్తితో పెళ్లవ్వగా... బాబు పుట్టాక వారిద్దరు విబేధాలతో విడిపోయారు. ఆ తర్వాత రాజమౌళి ఆమెను చూసి ప్రేమలో పడడం.. పెళ్లాడడం జరిగాయి.