భార‌త్‌లో కరోనా  పాజిటివ్ కేసుల సంఖ్య అంత‌కంత‌కూ పెరుగుతోంది. రోజుకు సుమారు ఐసీఎంఆర్ ల్యాబ్‌ల‌తోపాటు మ‌రికొన్ని ప్రైవేట్ ల్యాబ్‌ల‌లో క‌రోనానిర్ధార‌ణ ప‌రీక్ష‌లు చేప‌డుతున్నారు. రోజుకు సుమారు 30వేల‌కుపైగా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు చేస్తున్నారు. దీంతో వ్య‌యం కూడా అదేస్థాయిలో పెరుగుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు నిర్ధారణ పరీక్షల కోసం చేసిన వ్యయం ఏకంగా రూ.100 కోట్లు దాటింది. కరోనా అనుమానిత ల‌క్ష‌ణాలు ఉన్న‌వారికి దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్‌ ల్యాబుల్లో నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఒక్కో రివర్స్‌ ట్రాన్స్‌క్రిప్షన్‌ పాలిమరేజ్‌ చెయిన్‌ రియాక్షన్‌ (ఆర్‌టీ-పీసీఆర్‌) పరీక్షకు రూ.2,500 వ్యయం అవుతుంద‌ట‌.

 

ఇందులో రసాయనాల ఖ‌ర్చు రూ.800-1,500. రవాణా, మానవ వనరుల వ్యయం కలిపితే రూ.2,500 అవుతున్నది. ఈ నెల 19వతేదీ వ‌ర‌కు మొత్తం 4,01,586 క‌రోనా నిర్ధార‌ణ‌ పరీక్షలు నిర్వహించినట్టు ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) వెల్ల‌డించింది. ఈ గ‌ణాంకాల ప్ర‌కారం.. ఇప్పటివరకు రూ.102.65 కోట్లకుపైగా ఖ‌ర్చు అయిన‌ట్లు అధికార‌వ‌ర్గాలు చెబుతున్నాయి. అత్య‌ధికంగా మహారాష్ట్రలో 72వేల మందికి (రూ.18 కోట్లు), రాజస్థాన్‌లో 57వేల మందికి (రూ.14.3 కోట్లు) క‌రోనా నిర్ధార‌ణ‌ పరీక్షలు నిర్వహించారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: