దేశంలో కరోనా ముప్పు పొంచి ఉందని లాక్ డౌన్ పాటిస్తున్న విషయం తెలిసిందే. కానీ కొంత మంది నిర్లక్ష్యంగా అదే పనిగా రోడ్లపైకి రావడం వెకలి చేష్టలు చేయడం.. గుంపులుగా ఉండటం చేస్తున్నారు.  బయటకు అత్యవసర పనిపై రావాలిని.. ఇంటి నుంచి ఒక్కరే రావాలని.. బయటకు వస్తే సామాజిక దూరం పాటించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిరోజూ చెబుతూనే ఉన్నాయి. ఇక లాక్ డౌన్ ఉల్లంఘిస్తున్న వారికి పోలీసులు సామ వేద దండోపాయాలు అన్న రీతిలో బుజ్జగిస్తూ.. హిదబోద చేస్తూ.. లాఠీలకు కూడా పని చెబుతున్నారు.   దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ఉల్లంఘింన వారికి వినూత్నంగా శిక్షలు విధిస్తున్నారు. 

 

కొన్ని చోట్ల గుంజీలు తీయిస్తున్నారు.. కొన్ని చోట్ల మోకాళ్లపై నడిపిస్తున్నారు... వ్యాయామాలు చేపిస్తున్నారు.. లాఠీలతో కొడుతున్నారు.  తాజాగా లాక్‌డౌన్‌ను లెక్క చేయకుండా రోడ్డుపై తిరుగుతున్న వారందరినీ లైన్‌లో నిలబెట్టి.. హారతిచ్చి, అరటి పండు చేతిలో పెట్టారు ఉత్తరప్రదేశ్ పోలీసులు. ఈ ఘటన కాన్పూర్‌లోని కిడ్వాయి నగర్‌లో చోటు చేసుకుంది. దేవుళ్లకు హారతి ఇస్తోన్న సమయంలో చదివే మంత్రాలను కూడా పోలీసులు చదివారు.

 

 

ఇందుకు సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. కాన్పూర్‌లోని 17 ప్రాంతాలను కట్టడి ప్రాంతాలు (కంటైన్మెంట్‌)గా ప్రకటించారు. మరోవైపు ఇక్కడ కరోనా విజృంభిస్తున్న తరుణంలో పోలీసులు గట్టి బందోబస్తున్న చర్యలు తీసుకుంటున్నారు.  ఎవరూ బయటకు రాకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నప్పటికీ కొందరు అనవసరంగా బయటకు వస్తున్నారు. దీంతో లాక్‌డౌన్‌ ఉల్లంఘిస్తోన్న వారిపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: