ప్ర‌స్తుతం ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ ప్ర‌భావం ఎంత తీవ్రంగా ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఈ క్ర‌మంలోనే ప్ర‌పంచంలో వ్య‌వ‌స్థ‌లు అన్నీ ఎక్క‌డిక‌క్క‌డ స్ట్ర‌క్ అయిపోయాయి. ఇక ప్ర‌పంచ వ్యాప్తంగా అన్ని క్రీడ‌ల‌ను ఆపేశారు. క్రికెట్ లాంటి క్రీడ‌లు జ‌రుగుతుంటే గ్రౌండ్లలో ఎంత క్రౌడ్ ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఇప్పుడు క‌రోనా నేప‌థ్యంలో ఏకంగా అన్ని టోర్నీలు ఆగిపోయాయి. అస‌లు క్రికెట్ మ‌ళ్లీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో ?  కూడా చెప్ప‌లేని ప‌రిస్థితి.

 

ఈ క‌రోనా దెబ్బ‌తో ఈ ఏడాది అక్టోబర్​లో ఆస్ట్రేలియా వేదికగా ప్రారంభం కావాల్సిన టీ20 ప్రపంచకప్​ జరుగుతుందో లేదో అన్న అనుమానాలు ఎక్కువవుతున్నాయి. ఈ మెగా టోర్నీపై ఇప్పుడు పెద్ద సందేహాలు ముసురుకున్నాయి. దీనిప‌పై న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు స్పందించింది. జూలై తర్వాతే టీ 20 ప్రపంచకప్​ నిర్వహణపై నిర్ణయం వెలువడుతుందని క్లారిటీ వ‌చ్చింది.

 

ఇక ప‌రిస్థితులు అన్నీ అనుకూలిస్తే షెడ్యూల్ ప్రకారమే అక్టోబర్​-నవంబర్​లో ప్రపంచకప్ నిర్వహించాలని ప్రణాళికలు ర‌చిస్తున్నారు. ఏదేమైనా క‌రోనా ప్ర‌భావం త‌గ్గితే షెడ్యూల్ ప్ర‌కార‌మే టీ 20 ప్ర‌పంచ క‌ప్ జ‌రుగుతుంద‌న్న వార్త‌ల‌తో కోట్లాది మంది క్రీడాభిమానులు ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: