క‌రోనా వైర‌స్ నుంచి భార‌త్ ముందుముందు పెద్ద ప్ర‌మాద‌మే పొంచి ఉందా అంటే ప‌లువురు నిపుణులు మాత్రం ఔన‌నే అంటున్నారు. దేశంలో అన్నిరాష్ట్రాలు లాక్‌డౌన్‌ను పూర్తిస్థాయిలో అమలు చేయకపోతే సెప్టెంబర్‌ నాటికి 111 కోట్లమంది వైరస్‌ బారిన పడే ప్ర‌మాదం ఉంద‌ని విశ్లేషకులు హెచ్చ‌రిస్తున్నారు. నిజానికి లాక్‌డౌన్ అమ‌లు విష‌యంలో కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు క‌లిసిన‌డువ‌డం లేదు. వేటిక‌విగా నిర్ణ‌యాలు తీసుకుంటున్నాయి. ఈ ప‌రిణామాలు భార‌త్‌కు పెను విప‌త్తును తీసుకొస్తాయ‌ని, చూస్తుండ‌గానే అమెరికాలాగే భార‌త్ మార‌డం ఖాయ‌మని అమెరికాకు చెందిన సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌, డైనమిక్స్‌ అండ్‌ ఎకనామిక్‌ పాలసీ (సీడీడీఈపీ) ఓ నివేదికలో పేర్కొంది. సగటున 55 కోట్ల నుంచి దేశ జ‌నాభా మొత్తం క‌రోనా బారిన ప‌డే ప్ర‌మాదం పొంచి వుంద‌ని వెల్లడించింది. లాక్‌డౌన్‌లో ఇస్తున్న సడలింపులు దీనికి ఒక కారణంగా అభిప్రాయపడింది.

 

ప్ర‌స్తుతం వైరస్‌ సోకినప్పటికీ రోగుల్లో లక్షణాలు కనిపించకపోవటం పెద్ద సమస్య అని, ఇది ఇప్పుడు భార‌త్ 80శాతానికిపైగా ఉంద‌ని పేర్కొంది. త్వరలోనే భార‌త‌ దేశంలో క‌రోనా వైరస్‌ కేసులు పెద్ద మొత్తంలో పెరుగనున్నాయని చైనాకు చెందిన వైద్య నిపుణుడు, కొవిడ్‌-19 విశ్లేషకుడు, హౌషాన్‌ దవాఖాన డైరెక్టర్‌ వెన్‌హాంగ్‌ హెచ్చరించారు. లాక్‌డౌన్‌ను దేశ‌మంతా ఒకేతీరుగా క‌ఠినంగా అమ‌లు చేయ‌క‌పోతే.. అమెరికా ప‌రిస్థితులే భార‌త్‌లో నెల‌కొనే ప్ర‌మాద ఉంద‌ని, చైనాలో విధించిన 100 శాతం లాక్‌డౌన్‌ అన్ని దేశాలు పాటిస్తే మంచిదని ఆయన అభిప్రాయ‌ప‌డ్డారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: