దేశంలో క‌రోనా వైర‌స్ క‌ట్ట‌డికి ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ అనేక చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పించేందుకు అనేక వినూత్న కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్నారు. ఇప్ప‌టికే ప్ర‌ముఖ క్రీడాకారుల‌తో ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ మాట్లాడిన విష‌యం తెలిసిందే. క‌రోనా వైర‌స్‌పై పోరుకు క‌లిసిరావాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. తాజాగా.. పంచాయ‌తీరాజ్ దినోత్స‌వం సంద‌ర్భంగా గ్రామ‌స్థాయిలో కూడా క‌రోనా వైర‌స్ వ్యాప్తి నిరోధానికి తీసుకుంటున్న చ‌ర్య‌ల‌పై చ‌ర్చించేందుకు ఈ రోజు ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు.

 

ఈ సంద‌ర్భంగా ఈ-గ్రామ‌స్వ‌రాజ్ పోర్ట‌ల్ మొబైల్ యాప్‌ను ఆవిష్క‌రించారు. ఈ వీడియో కాన్ఫ‌రెన్స్‌లో దేశ‌వ్యాప్తంగా ఉన్నస‌ర్పంచ్‌లు పాల్గొన్నారు.  ఈ సంద‌ర్భంగా కరోనా వైర‌స్ క‌ట్ట‌డికి తీసుకుంటున్న చ‌ర్య‌ల‌పై స‌ర్పంచ్‌ల‌తో చ‌ర్చించారు. అనంత‌రం మోడీ మాట్లాడుతూ.. క‌రోనా వైర‌స్ క‌ట్ట‌డికి కృషి చేస్తున్న స‌ర్పంచ్‌ల‌కు ధ‌న్య‌వాదాలు తెలిపారు. గ్రామాల అభివృద్ధికి స‌ర్పంచ్‌లు కృషి చేయాల‌ని పిలుపునిచ్చారు. విద్యుత్, రోడ్లు, పారిశుధ్యంపై దృష్టి సారించాలి. క‌రోనా వ్యాప్తి నిరోధంపై ప్ర‌జ‌ల్లో విస్తృతంగా అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని అన్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: