ఏపిలో కరోనా మహమ్మారి తరిమి కొట్టేందుకు ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి అధికారులు, మంత్రులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు.  లాక్ డౌన్ సమయంలో రైతులకు ఎలాంటి కష్టం కలగకుండా చూడాలని ఆయన అంటున్నారు.  తాజాాగా రైతుల పంట ఉత్పత్తుల విక్రయానికి జనతా బజార్లు ఏర్పాటు చేస్తామని మంత్రి క న్నబాబు ప్రకటించారు. రైతుల ఉత్పత్తులకు స్థానిక మార్కెట్ ఉండేందుకే జనతా బజార్లు ఏర్పాటు చేస్తున్నామని, రేపటి నుంచి రైతులకు కూపన్లు అందజేస్తామని తెలిపారు. 

 

ఈ కూపన్ల ద్వారా రైతుల పంట కొనుగోలు చేస్తామని ఆయన అన్నారు.   పంటకు మద్దతు ధర కన్నా ఎక్కువ ధర వస్తే రైతులు అమ్ముకోవచ్చని అన్నారు.తడిసిన శనగలూ కొనుగోలు చేయాలని సీఎం జగన్ ఆదేశించారని చెప్పారు.  టమాట, మిర్చి, అరటి, పసుపు పంటలను కొనుగోలు చేయడం ద్వారా రైతులకు నష్టం లేకుండా చూస్తున్నామని అన్నారు.

 

రాయలసీమ నుంచి అరటి, బత్తాయిని మార్కెట్లకు తరలిస్తున్నట్టు చెప్పారు.  ఆంధ్రప్రదేశ్ లో  1,300 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని, ధాన్యానికి రూ.1,760 మద్దతు ధర  ఇస్తున్నట్టు తెలిపారు.  మే 15న ప్రతి రైతు ఖాతాలో రైతు భరోసా పెట్టుబడి సాయం కింద డబ్బులు జమ అవుతాయని అన్నారు.

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: