ప్ర‌పంచాన్ని గ‌డ‌గ‌డ‌లాడిస్తున్న క‌రోనా వైర‌స్ గురించి రోజురోజుకూ కొత్త‌కొత్త విష‌యాలు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. ప్ర‌తీ నోటా క‌రోనా ముచ్చ‌టే వినిపిస్తోంది. క‌రోనా వైర‌స్ పుట్టుక‌, వ్యాప్తి, నివార‌ణ‌కు సంబంధించిన అనేక ఆస‌క్తిక‌ర‌మైర అంశాల‌ను ప‌రిశోధ‌కులు వెల్ల‌డిస్తున్నారు. తాజాగా.. ఈ మ‌హ‌మ్మారి గురించి మ‌రొక ఇంట్రెస్టింగ్ విష‌యాన్ని శాస్త్ర‌వేత్త‌లు వెల్ల‌డించారు. బ్రిటన్ శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని బయటపెట్టారు. మానవ ముక్కులోని రెండు కీలక కణాలే కరోనా వైరస్‌కు ప్రవేశద్వారాలుగా ఉన్నాయ‌ని వారు గుర్తించారు. బ్రిటన్‌లోని వెల్కమ్ సాంగర్‌ ఇన్‌స్టిట్యూట్, నెదర్లాండ్స్‌లోని యూనివర్సిటీ మెడికల్ సెంటర్ గ్రొనిన్‌జెన్‌ శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల్లో ఈ విషయం వెల్ల‌డైంది.

 

ముక్కులోని ఏసీఈ-2, టీఎంపీఆర్ఎస్‌ఎస్‌-2 ప్రొటీజ్ అనే ప్రొటీన్లు కరోనా వైరస్‌ శరీరంలోకి ప్రవేశించడానికి వీలు కల్పిస్తున్నాయని శాస్త్ర‌వేత్త‌లు గుర్తించారు. ముక్కువ లైనింగ్ మీదున్న కణాలతో సహా శరీరంలోని వివిధ అవయవాల్లో కూడా ఈ క‌ణాలు ఉన్నట్లు వారు వెల్లడించారు. శ్వాసనాళాల్లోని ఇతర కణాలతో పోలీస్తే ముక్కులోని గోబ్లెట్ కణాలు, సిలియేటెడ్ కణాల్లో ఈ రెండు రకాల ప్రొటీన్లు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. క‌రోనా వైరస్‌ మానవ శరీరంలోకి వెళ్లేందుకు ఈ రెండు క‌ణాలు ప్రైమ‌రీ ఇన్‌స్పెక్షన్ మార్గాలుగా ఉంటున్నాయ‌ని పేర్కొన్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: