ప్రపంచంలో కరోనా బాధితుల కేసులు రోజు రోజుకీ పెరిగిపోతూనే ఉన్నాయి.  చిన్నా.. పెద్ద దేశాల్లో కరోనా మహమ్మారితో ప్రజలు దారుణ మరణాలు పొందుతున్నారు.  తాజాగా పాకిస్థాన్‌లో కరోనా కేసులకు అడ్డుకట్ట పడడం లేదు. ప్రతి రోజు పెద్ద సంఖ్యలో వైరస్ నిర్ధారిత కేసులు బయటపడుతున్నాయి.  ప్రతిరోజూ కరోరా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో ఇక్కడ కూడా లాక్ డౌన్ పెంచాలని ప్రతిపాదనలు మొదలయ్యాయి.  దాంతో లాక్‌డౌన్‌ను మే 9 వరకు పొడిగిస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు ప్రణాళిక, అభివృద్ధిశాఖ మంత్రి అసద్ ఉమర్ తెలిపారు. గత 24 గంటల్లో పాక్‌లో కొత్తగా 642 కేసులు నమోదయ్యాయి.

 

దీంతో దేశవ్యాప్తంగా మొత్తం నమోదైన కేసుల సంఖ్య 11,155కు పెరిగింది.  ప్రస్తుతం రంజాన్ మాసం కొనసాగుతుంది.. ఈ నేపథ్యంలో ప్రార్థనా మందిరాల్లో విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని చూస్తున్నారు.  కరోనా వల్ల 2,537 మంది కోలుకోగా, 237 మంది ప్రాణాలు కోల్పోయారు.

 

కాగా, దేశంలో నమోదవుతున్న కేసుల్లో 79 శాతం స్థానికంగా ఒకరి నుంచి ఒకరికి  సోకడం ద్వారా వచ్చినవేనని ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.  మరోవైపు, రంజాన్ మాసం ప్రారంభం కావడంతో ప్రార్థనలు చేసుకునేందుకు ప్రభుత్వం కొన్ని షరతులతో అనుమతి ఇచ్చింది.  ప్రపంచంలో కొన్ని దేశాల్లో లాక్ డౌన్ మినహాయింపు ఇస్తున్న విషయం తెలిసిందే.  

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle


Apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: