దేశంలో ఇప్పుడు ఎక్కడ చూసినా కరోనా టాపిక్ నడుస్తుంది.  ప్రజలు పిట్టాల్లా రాలిపోతున్నారు.. కేసులు లక్షల్లో పెరిగిపోతున్నాయి.  కరోనాని ఎంత కట్టడి చేయాలని చూసినా దాని ప్రభావం పెరిగిపోతూనే ఉంది.  తాజాగా ఓ ట్రైనీ ఐపీఎస్ ఆఫీసర్ కి కరోనా పాజిటీవ్ రావడం కలకలం చేపింది.  అయితే అతను చేసిన పాపలం అల్లా కరోనా బాధితుడిని పారిపోకుండా చూడటమే. వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ జిల్లాలో శుక్రవారం ట్రైనీ ఐపిఎస్ అధికారికి కరోనా వైరస్ పాజిటివ్ పరీక్షలు చేసినట్టు ఆరోగ్య అధికారి తెలిపారు.

 

ఆ అధికారి ఇంతకుముందు పొరుగున ఉన్న నర్సింగ్‌పూర్ జిల్లాలో COVID-19 కు గురైన ఖైదీని ఆసుపత్రి నుండి తప్పించుకుంటుండగా పట్టుకున్నాడు.   అయితే ఎందుకైనా మంచిదని ఆ అధికారికి కూడా కరోనా పరీక్షలు నిర్వహించగా అతనికి కూడా కరోనా సోకినట్లు నిర్దారణ అయినట్లు జిల్లా చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ ఎంకే మిశ్రా తెలిపారు.

 

కాగా, ఏప్రిల్ 7 న ఇండోర్‌లోని చందన్ నగర్ ప్రాంతంలోని ఒక పోలీసుపై రాళ్లు విసిరినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 25 ఏళ్ల వ్యక్తి , అతని 58 ఏళ్ల తండ్రిపై జాతీయ భద్రతా చట్టం (ఎన్‌ఎస్‌ఏ) కింద కేసు నమోదైంది. ఈ యువకుడు రెండు వారాల క్రితం జబల్పూర్ మెడికల్ హాస్పిటల్ నుండి తప్పించుకున్నాడు. ట్రైనీ ఐపిఎస్ అధికారి అతన్ని పట్టుకోవడానికి వెళ్ళారు. ఇదే కారణంతో ఆ ఐపీఎస్ ఆఫీసర్ కి కూడా కరోనా పాజిటీవ్ వచ్చింది. 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle


Apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: