ఓ వైపు క‌రోనా వైర‌స్ విధ్వంసం సృష్టిస్తోంది.. దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్ కొన‌సాగుతోంది.. జ‌న‌మంతా ఇళ్ల‌కే ప‌రిమితం అయిపోయారు. బిక్కుబిక్కుమంటూ పూట‌గ‌డుపుతున్నారు.. మ‌రోవైపు సినిమాలు విడుద‌ల అవుతున్నాయి.. అయితే ఇది మీరు అనుకున్న‌ట్లు పెద్ద‌పెద్ద హీరోలు, ద‌ర్శ‌కులు తీసిన సినిమా కాదండోయ్‌..!  క‌రోనా వైర‌స్ ప‌రిస్థితుల‌పై మెగాఫ్యాన్ రూపొందించిన మెగా షార్ట్ ఫిలిమ్ ఇది. పేరు *స్టోరీ మారిపోద్ది* ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఈ రోజు విడుద‌ల విడుద‌ల చేశారు. మే 1న సినిమాను విడుద‌ల చేయ‌నున్నారు. ఈ పోస్ట‌ర్‌ను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, రాష్ట్ర చిరంజీవి యువ‌త ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, రాష్ట్ర రాంచ‌ర‌ణ్ యువ‌శ‌క్తి వ్య‌వ‌స్థాప‌కుడు శివ చెర్రీ ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశారు.

 

 అయితే.. ఈ షార్ట్ ఫిలిమ్‌లో క‌రోనా వైర‌స్‌కు సంబంధించిన ఎలాంటి అంశాల‌ను చూపించార‌న్న‌ది అంద‌రిలో ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. ఇక్క‌డ మ‌రొక విష‌యం ఏమిటంటే.. అస‌లు లాక్‌డౌన్ స‌మ‌యంలో ఎవ‌రూ ఇళ్ల నుంచే బ‌య‌ట‌కు రాలేని ప‌రిస్థితిలో మెగాఫ్యాన్స్ ఈ షార్ట్ ఫ‌లిమ్ ఎలా తీశార‌న్న‌ది ఆస‌క్తిదాయ‌క‌మే మ‌రి. మే 1న ఉద‌యం 11గంట‌ల 11నిమిషాల‌కు విడుద‌ల కానున్న ఈ షార్ట్ ఫిలిమ్ ప్రేక్ష‌కుల ఎంత‌మేరకు ఆక‌ట్టుకుంటుందో చూడాలి మ‌రి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: