చైనాలోని వుహాన్‌న‌గ‌రం కేంద్రంగా పుట్టిన క‌రోనా వైర‌స్ చూస్తుండ‌గానే ప్ర‌పంచాన్ని చుట్టేసి అత‌లాకుత‌లం చేస్తోంది. ఇప్ప‌టివ‌ర‌కు సుమారు2ల‌క్ష‌ల మంది ప్రాణాల‌ను బ‌లితీసుకుంది. సుమారు 30ల‌క్ష‌ల మంది ఈ వైర‌స్ బారిన‌ప‌డ్డారు. అత్య‌ధిక మ‌ర‌ణాలు, కేసులు ఎక్కువ‌గా యూర‌ప్ దేశాల‌తోపాటు అమెరికాలోనే ఎక్కువ‌గా న‌మోదు అవుతున్నాయి. అందులోనూ ఇట‌లీ, స్పెయిన్‌, ఫ్రాన్స్‌, జ‌ర్మ‌నీలో క‌రోనా వైర‌స్ బీభ‌త్సం సృష్టించింది. ప్ర‌పంచ వ్యాప్తంగా సంభ‌వించిన క‌రోనా మ‌ర‌ణాల్లో సుమారు స‌గానికిపైగా ఈ దేశాల్లోనే సంభ‌వించాయంటే ప‌రిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. ఇట‌లీ, స్పెయిన్‌, ఫ్రాన్స్‌, జ‌ర్మ‌నీలో కరోనా మరణాలు ఎక్కువ సంభవించడానికి వాయుకాలుష్యం ఓ కారణమ‌ని ప‌లువురు పరిశోధకులు అంటున్నారు.

 

కరోనా సోకిన వారు శ్వాస తీసుకోవడానికి తీవ్ర ఇబ్బంది పడుతుంటార‌ని, అదే సమయంలో వారు కలుషితమైన వాయువును పీల్చడం వల్ల మరింత ఇబ్బందులు ఎదుర్కొని చివరికి ప్రాణాలు కోల్పోతున్నట్లు వారి ప‌రిశోధ‌న‌లో తెలిపారు. ఇటలీ, స్పెయిన్‌, ఫ్రాన్స్‌, జర్మనీలలో 80శాతం మరణాలు కాలుష్యం తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లోనే సంభవించినట్లు ఆ శాస్త్ర‌వేత్త‌లు పేర్కొన్నారు. కాగా, ప్రపంచవ్యాప్తంగా ఇప్ప‌టివ‌ర‌కు 195,000 మందికి పైగా మరణించారు. 27 లక్షలకు పైగా వైర‌స్ సోకింది. కొవిడ్కే-19 సుల సంఖ్య ఇప్ప‌టివ‌ర‌కు స్పెయిన్ (219,764), ఇటలీ (192,994), ఫ్రాన్స్ (159,495), జర్మనీ (154,545), యునైటెడ్ కింగ్‌డమ్ (144,635)లో ఉంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: