ఏపీలో కరోనా విజృంభిస్తున్న సమయంలో వైసీపీ, టీడీపీ కొంతకాలం సైలెంట్ గా ఉన్నాయి. ఒక పార్టీ మరొక పార్టీపై విమర్శలు చేయడం పూర్తిగా తగ్గించాయి. కానీ ఊహించని విధంగా ఏపీ ప్రభుత్వం ర్యాపిడ్ కిట్లను కొనుగోలు చేయడంతో టీడీపీ వైసీపీపై విమర్శలు మొదలుపెట్టింది. ఆ తరువాత ఇరు పార్టీల నేతలు ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకోవడం జరుగుతోంది. అయితే వైసీపీపై, జగన్ పై విమర్శలు చేస్తున్న చంద్రబాబు మోదీని పల్లెత్తు కూడా అనడం లేదు. 
 
దేశవ్యాప్తంగా కేసులు నమోదవుతున్న తరుణంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో స్నేహo కొనసాగించాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం చంద్రబాబు పీఎంవో కార్యాలయానికి తాను కాల్ చేశానని... రెండు నిమిషాలు మోదీతో మాట్లాడాలని కోరానని... మరుసటి రోజు మోదీ తనకు కాల్ చేశారని చెప్పుకొచ్చారు. 2019 ఎన్నికల ఫలితాల అనంతరం చంద్రబాబు బీజేపీ, జనసేనకు దగ్గరవడానికి చంద్రబాబుకు ప్రయత్నిస్తున్నారు. 
 
మరోవైపు చంద్రబాబు మోదీని స్పూర్తిగా పనిచేయాలని టీడీపీ నాయకులకు పిలుపునిచ్చారు. ఈ పిలుపుపై ఏపీ బీజేపీ నాయకుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 2019 ఎన్నికలకు కొన్ని నెలల ముందు తీవ్ర విమర్శలు చెసీన చంద్రబాబు... ఇప్పుడు మోదీని స్పూర్తిగా తీసుకోవడం ఏమిటని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో వైసీపీ బీజేపీ మధ్య సఖ్యత బాగానే ఉంది. జగన్ పై విమర్శలు చేస్తూ... మోదీని ప్రశంసిస్తున్న చంద్రబాబు బీజేపీకి దగ్గర కావడంలో సక్సెస్ అవుతాడో లేదో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: