భారతదేశపు మొత్తం కరోనావైరస్ పాజిటివ్‌ కేసుల సంఖ్య 29,451కు చేరుకుంది. మరణాల సంఖ్య 939గా ఉందని వరల్డ్‌మీటర్ డేటా వెల్ల‌డించింది. అత్య‌ధిక క‌రోనా పాజిటివ్ కేసులు, మ‌ర‌ణాలు మ‌హారాష్ట్ర‌, గుజ‌రాత్‌, ఢిల్లీ, త‌మిళ‌నాడు, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోనే న‌మోదు అవుతున్నాయి. అయితే.. కేసులు నిరంతరం పెరుగుతుండటంతో దేశవ్యాప్తంగా కొన‌సాగుతున్న లాక్‌డౌన్‌ను మే 3వ తేదీ త‌ర్వాత కూడా పొడిగించే అవ‌కాశాలు ఉన్నాయ‌ని ప‌లువురు విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. నిన్న ప్రధాని నరేంద్ర మోడీతో జ‌రిగిన వీడియో కాన్ఫ‌రెన్స్‌లో కూడా ఆరుగురు ముఖ్య‌మంత్రులు లాక్‌డౌన్‌ణు పొడిగించాల‌ని సూచించారు. క‌రోనా వైర‌స్ క‌ట్ట‌డికి లాక్‌డౌన్‌ను పొడిగించ‌డం ఒక్క‌టే మార్గ‌మ‌ని వారు చెప్పారు.

 

ఈ నేప‌థ్యంలో రెడ్‌, ఆరెంజ్‌, గ్రీన్‌జోన్ల వారీగా లాక్‌డౌన్ స‌డ‌లింపుల‌ను ఇచ్చే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఇక ప్ర‌పంచ వ్యాప్తంగా ఇప్ప‌టివ‌ర‌కు 3,062,054 మంది కరోనా బారిన ప‌డ్డారు. ఇప్పటివరకు 211,433 మంది మ‌ర‌ణించారు. ఇటలీ, స్పెయిన్, జర్మనీ, యుఎస్, చైనా, న్యూజిలాండ్, నార్వే, జర్మనీ త‌దిత‌ర దేశాల్లోనే అత్య‌ధిక కేసులు, మ‌ర‌ణాలు సంభ‌విస్తున్నాయి. ప్రస్తుతం అమెరికాలో 1,010,123, స్పెయిన్లో  229,422, ఇటలీలో199,414, ఫ్రాన్స్‌లో 165,842, జర్మనీలో 158,758 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: