ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు మీడియాతో మాట్లాడుతూ విద్యార్థుల బోర్డింగ్, లాడ్జింగ్ కు జగనన్న వసతి దీవెన పథకం కింద 20,000 రూపాయలు ఇచ్చామని అన్నారు.  జగనన్న విద్యా దీవెన పథకం కింద ప్రతి త్రైమాసికం పూర్తయిన వెంటనే విద్యార్థుల తల్లుల ఖాతాలలో ఫీజుల నగదును జమ చేస్తామని తెలిపారు. నాన్నగారు మొదటిసారిగా ఫీజు రీయింబర్స్ మెంట్ పథకం తెచ్చారని అన్నారు. అందరి ఆశీర్వాదంతో ఈ పథకాన్ని ప్రారంభించామని చెప్పారు. 
 
పూర్తి ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం ఈ పథకం తెచ్చామని అన్నారు. దేశానికే ఈ పథకం ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి తల్లుల ఖాతాలలోనే ఫీజుల నగదు జమవుతుందని తెలిపారు. తల్లులు నేరుగా కాలేజీలకు వెళ్లి ఫీజులు కట్టాలని కాలేజీలలో వసతి, బోధన బాగాలేకపోతే విద్యార్థుల తల్లి ప్రశ్నించవచ్చని తెలిపారు. ఇప్పటికే ఫీజులు కట్టి ఉంటే ఆ డబ్బులను కాలేజీలు వెనక్కు ఇవ్వాలని కాలేజీలకు జగన్ సూచించారు. 
 
విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లలను గొప్పగా చదివించుకుంటారని తాను ఆశిస్తున్నానని తెలిపారు విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లల చదువు కోసం అప్పుల పాలు కాకూడదని అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: