ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులపై సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టు నిర్మాణ తాజా పరిస్థితుల గురించి ఉన్నతాధికారులతో చర్చించారు. నిర్దేశించిన లక్ష్యాల గురించే జగన్ ప్రధానంగా చర్చించినట్టు తెలుస్తోంది. ఇరిగేషన్ శాఖా మంత్రి అనిల్ కుమార్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. 2021 జూన్ నెల నాటికి ప్రాజెక్టును పూర్తి చేయాలని జగన్ అధికారులకు సూచించారు. 
 
లక్ష్యానికి తగ్గట్లుగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలన్నారు. జగన్ గత సీఎంకు భిన్నంగా అంశాల వారీగా వివరించాలని తెలుస్తోంది. పనులు జరగడానికి ఉన్న అడ్డంకులపై దృష్టిపెట్టాలని అధికారులకు సూచించారు. కాఫర్ డ్యాం పనులు ఎట్టి పరిస్థితుల్లోను పూర్తి చేయాలని సూచించారు. పనుల డిజైన్లు అనుమతుల్లో ఆలస్యం కాకుండా ఉండేలా ప్రత్యేకంగా దృష్టిపెట్టాలని సీఎం సూచించారు. ప్రాధాన్యతా క్రమంలో తరలించాల్సిన వారి వివరాలు సిద్ధం చేసుకోవాలని అధికారులకు చెప్పారు. 
 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: