ప్రస్తుతం లాక్డౌన్ నేపథ్యంలో సెలబ్రిటీలు ఇళ్లల్లోనే ఉంటూ ఎవరి పని వాళ్లు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే పలువురు తాము చేసిన వంట పనో... ఇంటి పనో వీడియోలుగా చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. మరి కొందరు కరోనా నేపథ్యంలో ఎంత ధైర్యంగా ఉండాలో చెపుతున్నారు. ఇక హాట్ యాంకర్ అనసూయ ఎప్పటికప్పుడు ట్విట్టర్లో ఎంత యాక్టివ్గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ క్రమంలోనే తాను సినీ కార్మికులకు ఫండ్ ఇవ్వలేదన్న ట్రోల్ చేస్తోన్న నెటిజన్లకు సైతం ఘాటుగా రిప్లే ఇచ్చిన అనసూయ ప్రస్తుతం ఇంట్లోనే ఉంటూ ఓ రేంజ్లో ఎంజాయ్ చేస్తోంది.
తాజాగా ఆమె పొట్టి నిక్కరు వేసుకుని తన వంట గదిలో ఓ వైపు వంట చేస్తూ వేస్తోన్న స్టెప్పులు అయితే మతిపోయేలా ఉన్నాయి. నీలం కలర్ టీ షర్టుతో పాటు పిక్కలు కనపడేలా రెడ్ పొట్టి నిక్కర్ వేసుకున్న ఆమె పాటకు హీరోయిన్ను మించిపోయేలా వేసిన స్టెప్పులు సోషల్ మీడియాను ఓ ఊపు ఊపుతున్నాయి. అసలు అనసూయ అంటే గిట్టని వాళ్లు కూడా ఈ స్టెప్పులను పదే పదే చూడాలనిపించేలా ఉన్నాయి. ఈ వీడియోపై మీరు కూడా ఓ లుక్కేయండి.
Dance Like Nobody’s Watching you!! @anusuyakhasba 💃💃#InternationalDanceDay #AnasuyaBharadwaj #TeluguFilmNagar pic.twitter.com/bcPbY9aBNZ
— telugu FilmNagar (@telugufilmnagar) April 29, 2020