కరోనా కరోనా ఈ కరోనా వైరస్ వల్ల ఎరికి ఇబ్బంది ఉన్నా లేకున్నా.. మందుబాబులకు మాత్రం నానా కష్టాలు వచ్చాయి.  సాయంత్రం కాగానే బార్ వెళ్లడం.. లేదా మద్యం షాపులకు వెళ్లి మందు పుచ్చుకొని దాంతోపాటు కాస్త చికెన్ కానీ మటన్ కానీ తిని జీవితానికి ఇది చాలు అకునే వారికి గత నెల రోజు ల నుంచి చుక్కలు కనిపిస్తున్నాయి. దాంతో చాలా మంది పిచ్చిపట్టినవారిలో మారిపోతున్నారు. మరికొంత మంది మందు ఎలా తయారుచేసుకోవాలా అని రీసెర్చ్ చేస్తున్నారు.  ఇలా దిక్కుమాలిన ప్రయోగాలు చేసి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.  ఇలాంటి ఘటనే ఓ ఇద్దరి ప్రాణాలు తీసింది. వివరాల్లోకి వెళ్తే.. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి హౌసింగ్‌ బోర్డు కాలనీకి చెందిన షేక్‌ బాబా, రియాజ్‌ అనే ఇద్దరు యువకులు ఉంటున్నారు.

 

మూడు రోజుల కిందట ఓ ప్లాస్టిక్‌ డ్రమ్మును కొనుగోలు చేసిన ఆ ఇద్దరు యువకులు.. ఆ డ్రమ్ము మూత తీస్తుండగా.. ఆల్కహాల్‌ వాసన వచ్చిందంట... ఇంకేముంది దాన్ని కాస్త నీళ్లలో కలుపుకొని తాగారు.  అస్వస్థతకు గురయ్యారు.. ఇక, కుటుంబసభ్యులు వీరిని హైదరాబాద్‌ ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ ఇద్దరూ మృతి చెందారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. ఇలాంటి పిచ్చి ప్రయోగాలు చేసి ప్రాణాల మీదకు తెచ్చుకోవొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: