దేశంలో ప్రతిరోజూ కరోనా కేసులు పెరిగిపోతున్నాయి.  ఇక తెలుగు రాష్ట్రాల్లో కోరోనాపై ఎంత కట్టడి చేస్తున్నా కేసులు మాత్రం పెరిగిపోతున్నాయి.  ఏపిలో  24 గంటల్లో 71 కేసులు నమోదు కావడంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య గురువారానికి 1403కు చేరిందని అధికారులు హెల్త్‌ బులిటెల్‌ రిలీజ్‌ చేశారు. 24 గంటల్లో 6479 మందికి టెస్టులు చేశామని అన్నారు. ఇప్పటి వరకు 31 మంది చనిపోగా.. 321 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. 1051 మంది హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్‌ తీసుకుంటున్నారు. గత కొన్ని రోజుల నుంచి  గుంటూరు జిల్లాను అతలాకుతలం చేస్తోంది. ముఖ్యంగా నరసరావుపేటలో భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదు కావడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.

 

ఇక్కడ వందకు పైగా కేసులు బయటపడడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.  ఇటీవలే ఓ వ్యక్తి ఢిల్లీలోని మర్కజ్ కు వెళ్లి రాగా, అతడితో కలిసి ఓ కేబుల్ ఆపరేటర్ టీ తాగాడు. అక్కడి నుంచే కరోనా వ్యాప్తి తీవ్రమైనట్టు అధికారులు గుర్తించారు.  అయితే ఈ కేబుల్ ఆపరేటర్ పలువురిని కలిసినట్లు అధికారులు చెబుతున్నారు. వరవకట్ట ప్రాంతానికి చెందిన ఆ కేబుల్ ఆపరేటర్ కారణంగా 50 మందికి సంక్రమించినట్టు తెలుసుకున్నారు. కేబుల్ ఆపరేటర్ గుంటూరులో చికిత్స పొందుతూ మరణించాడు.

 

మరణానంతరం అతడికి కరోనా పాజిటివ్ అని గుర్తించారు. నలుగురు వైద్యులు కూడా కరోనా బారినపడినట్టు వెల్లడైంది.  కేబుల్ ఆపరేటర్ ఇంటి సమీపంలో నివసించే హోంగార్డుకు ఈ నెల 14న కరోనా పాజిటివ్ ప్రస్తుతం అతను రసరావుపేటలోనే ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇలా ఇరబై మందికి కరోనా పాజిటీవ్ తేలినట్లు సమాచారం.  మొత్తానికి వన్ బైటూ చాయ్ తాగిన పాపానికి కరోనా కల్లోలం సృష్టిస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: