దేశంలో కరోనా మహమ్మారి పెరిగిపోతున్న నేపథ్యంలో గత నెల 24 నుంచి లాక్ డౌన్ పాటిస్టున్నారు.  అయితే కరోనా విస్తరణ మరింత పెరిగిపోవడంతో గత నెల 14 నుంచి మలి విడత లాక్ డౌన్ పెంచారు.  ఈ నెల  3 వరకు లాక్ డౌన్ ఉంటుందని ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. అయితే రేపు ఈ విషయంపై ఆయన దేశ  ప్రజలను ఉద్దేవించి మరోసారి మాట్లాడనున్నారు.  ఇక దేశంలో కరోనా మహమ్మారి ఇంకా తగ్గకపోవడంతో లాక్ డౌన్ పెంచే అవకాశాలు ఉన్నాయని.. అంటే మరో రెండు వారాల పాటు లాక్ డౌన్ కొనసాగించాలని.. అది 17 వరకు సాగించాలని నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర సమాచారం. ఈ క్రమంలో కేంద్ర హోంశాఖ.. లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. కొత్త మార్గదర్శకాలను కేంద్రం జారీ చేసింది.

 

ఇక శనివారం ఉదయం 10 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు. కరోనా కట్టడి కొనసాగింపు చర్యలపై మోదీ స్పష్టత ఇవ్వనున్నారు. దేేశ వ్యాప్తంగా విమానాలు, రైళ్లు, మెట్రో సర్వీసులు, అంతర్‌ రాష్ర్టాల మధ్య రాకపోకలు, పాఠశాలలు, కళాశాలలతో పాటు శిక్షణ, కోచింగ్‌ సంస్థలపై నిషేధం విధించారు.  అయితే ఆరెంజ్‌ జోన్లలో కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది కేంద్రం. సైకిళ్లు, రిక్షాలు, ఆటో రిక్షాలు, ట్యాక్సీలు, క్యాబ్‌లు, బస్సులు, కటింగ్‌ షాపులపై నిషేధం విధించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: