క‌రోనా వైర‌స్ నిర్ధార‌ణ ప‌రీక్ష‌ల్లో భార‌త్ చాలా వెనుక‌బ‌డి ఉంది. నిర్ధార‌ణ ప‌రీక్ష‌ల్లో వేగం పెంచేందుకు అనేక ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. అయితే.. ర్యాపిడ్ టెస్టింగ్‌కిట్ల‌తో కేవ‌లం ప‌దినిమిషాల్లోనే క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు చేస్తున్నారు. తాజాగా.. కేవలం 30 సెక‌న్ల‌లోనే క‌రోనా వైర‌స్ నిర్ధార‌ణ చేయొచ్చున‌ని మ‌న‌వాళ్లు గుర్తించారు. 30 సెకన్లలో కరోనా ఉందో లేదో నిర్ధారించే సరికొత్త ఉపకరణాన్ని హైదరాబాద్‌లోని జాతీయ పశు జీవసాంకేతిక విజ్ఞాన సంస్థ నిపుణులు కనుగొని ఔరా అనిపించారు. కేవలం లాలాజలం శాంపిల్ తీసుకొని దాని ద్వారా 30 సెకన్లలోనే కరోనాను నిర్ధారించవచ్చని వారు కనిపెట్ట‌గా వీరి కృషికి గాను మన దేశ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు స్పందించి, ప్రశంసల జల్లు కురిపించారు.

 

*లాలాజలం ఆధారంగా 30 సెకన్లలోనే కరోనాను నిర్ధారించేలా హైదరాబాద్‌లోని జాతీయ పశు జీవసాంకేతిక విజ్ఞాన సంస్థ (ఎన్ఐఏబీ) కొత్త ఉపకరణాన్ని రూపొందించడం ముదావహం. శాస్త్రవేత్తలకు అభినందనలు. ఈ ఉపకరణం అందుబాటులోకి వస్తే.. ఈ మహమ్మారిపై జరుగుతున్న పోరాటానికి కొత్త శక్తి అందినట్లవుతుంది.” అని వెంక‌య్య‌నాయుడు తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా ప్ర‌శంసించారు. ఈ సంద‌ర్భంగా దేశ‌వ్యాప్తంగా వారిపై ప్ర‌శంస‌ల జ‌ల్లుకురుస్తోంది. తొంద‌ర‌గా దానిని అందుబాటులోకి తీసుకొచ్చి మ‌హ‌మ్మారిని త‌రిమికొట్టాల‌ని కోరుతున్నారు. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: