రష్యాలో క‌రోనా మ‌హ‌మ్మారి విధ్వంసం కొనసాగుతోంది. రోజురోజుకూ క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. గత 24 గంటల్లో 10,633 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.  దేశంలో ఒకేరోజు ఐదంకెల సంఖ్యలో కరోనా కేసులు నమోదవడం ఇదే మొదటిసారని ప్ర‌భుత్వ వ‌ర్గాలు చెబుతున్నాయి. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,34,687కు చేరింది. ఇందులో 5345 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని అధికారులు తెలిపారు. ఇప్పటివరకు దేశ‌వ్యాప్తంగా 1,280 మంది క‌రోనా వైర‌స్‌తో మరణించారు. 16,639 మంది బాధితులు క‌రోనా నుంచి కోలుకుని ఆస్ప‌త్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అయితే.. మాస్కోలోనే అత్య‌ధిక కేసులు న‌మోదు అవుతున్నాయి.

 

 

చైనాలో క‌రోనా విజృంభించిన‌ప్పుడు ర‌ష్యాలో పెద్ద‌గా ప్ర‌భావ‌మే క‌నిపించ‌లేదు. గ‌త కొద్దిరోజులుగా మాత్ర‌మే వైర‌స్ విజృంభిస్తోంది. రోజువారీగా వేల సంఖ్య‌లో పాజిటివ్ కేసులు న‌మోదు అవుతున్నాయి. దీంతో ప్ర‌భుత్వ‌వ‌ర్గాలు తీవ్ర ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నాయి. వైర‌స్ వ్యాప్తి నిరోధానికి మ‌రింత క‌ట్టుదిట్టంగా చ‌ర్య‌లు తీసుకునేందుకు ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తోంది. ఇక ప్ర‌పంచ వ్యాప్తంగా ఇప్పటివరకు 34,40,904 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇందులో 2,43,922 మంది మరణించగా, 10,96,057 మంది కోలుకున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: