ఆంధ్రప్రదేశ్‌లో నేటి నుంచి మద్యం దుకాణాలు తెరుచుకోనున్నాయి. అయితే, మందుబాబులకు షాకిచ్చేలా మద్యం ధరలను పెంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు రాష్ట్రంలో మద్యం దుకాణాలు తెరవాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో నేటి నుంచి  రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాలు తెరుచుకోనున్నాయి. కంటైన్మెంట్ జోన్‌లు మినహా మిగతా చోట్ల మద్యం అమ్మకాలు జరుగనున్నాయి.  సీఎం వైఎస్ జగన్ ఆధ్వర్యంలో నిన్న జరిగిన సమీక్ష సమావేశంలో మద్యం ధరలను 25 శాతం మేర పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. ఫలితంగా ఖజానాకు అదనంగా రూ.4,400 కోట్ల అదనపు ఆదాయం సమకూరుతుందని అంచనా.  కాగా నేటి మద్యం ధరలను 25శాతం పెంచుతున్నట్లు ప్రభుత్వం  ప్రకటించింది. షాపుల వద్ద రద్దీని తగ్గించేందుకు రేట్లు పెంచినట్లు సర్కార్ పేర్కొంది.

 

కానీ ఈ మద్యం అమ్మకాలు కొన్ని చోట్ల మాత్రం తీవ్రంమైన కండీషన్లు అప్లై అంటున్నారు.  రాజమండ్రిలోని ఏడు కంటైన్మెంట్ జోన్లలో మినహా అన్ని ప్రాంతాల్లో మద్యం దుకాణాలు తెరవచ్చని ది రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ తెలిపింది. అయితే 144 సెక్షన్, కరోనా జాగ్రత్తలు పాటిస్తూ  ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ షాపులకు అనుమతినిచ్చింది. 

 

ఇకప్రకాశం జిల్లాలో సందిగ్దత కొనసాగుతుంది..  దుకాణాలకు మద్యం సరఫరా చేసే డిపోలు ఒంగోలు నగరంలోని పేర్నమిట్ట, మార్కాపురం పూల సుబ్బయ్య కాలనీలు రెండూ రెడ్‌జోన్ పరిధిలోనే ఉన్నాయి. అయితే దుకాణాల్లో ఉన్న సరుకునైనా విక్రయించేందుకు అవకాశం కల్పించాలని జిల్లా కలెక్టర్ దృష్టికి ఎక్సైజ్ అధికారులు తీసుకెళ్లారు. దీనిపై ఉన్నతాధికారులతో సమీక్షించి కలెక్టర్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: