సాధారణంగా పండుగలు ఏదైనా ప్రత్యేకమైన రోజులు వస్తే సంబరాలు చేసుకుంటారు.. కానీ ఇప్పుడు దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారితో మార్చి 24 నుంచి లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో మద్యం షాపులు మూసి వేశారు.  దాంతో సుక్క మందులేక మందు బాబులు కొందరు ఆత్మహత్య చేసుకున్నారు.. మందుని ఎలా కనిపెట్టాలో నేర్చుకున్నారు.. కొంతమంది ఆల్కాహాలు అనుకొని ఏది పడితే అది తాగుతూ ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు.. మరికొంత మంది పిచ్చాసుపత్రిపాలయ్యారు.  ఇన్నాళ్లకు కేంద్రం కరుణించింది.. తమ ప్రార్థనలు మన్నించింది.. దేవుడు వరం ఇస్తే నాకు మద్యం షాపు తెరిచి పెట్టాలని సామీ అనే పరిస్థితి మందు బాబులకు నెలకొంది. 

బెంగళూరులో ఓ మందుబాబు వైన్‌ షాపు ముందు కొబ్బరికాయ కొట్టాడు..

 

ఈ నేపథ్యంలో గ్రీన్ జోన్లలో మద్యం అమ్మకాలకు పరిమిషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. దాంతో పలు రాష్ట్రాల్లో మద్యం షాపులు కండీషన్లపై ఓపెన్ చేశారు.  ఇన్నాళ్లకు తమకు స్వాతంత్రం వచ్చింది.. మంచి రోజులు వచ్చాయని.. దేవుడు ఉన్నాడు.. మమ్ముల్ని కరుణించాడని భావించి..  వైన్స్ షాపు ముందు కొబ్బరి కాయలు కొట్టారు... పూజలు చేశారు.. మరికొంత మంది బానా సంచా కాల్చుతూ తమ ఆనందాన్ని ఆకాశమంత చాటుకున్నారు.  పట్టరాని సంతోషంతో మద్యం దుకాణాల ముందే డ్యాన్సులు వేస్తున్నారు.

 

కర్ణాటకలో మందు దుకాణం ముందు టపాసులు పేల్చిన మందు ప్రియులు.. 

 

వైన్స్ షాపు ముందు అమ్మాయిల క్యూ..

మరింత సమాచారం తెలుసుకోండి: