దేశంలో గత 40 రోజుల నుంచి లాక్ డౌన్ ఉన్న నేపథ్యంలో మద్యం షాపులు మూసివేశారు.  అయితే మద్యం షాపులు తెరుచుకునేందుకు కేంద్రం పరిమిషన్ ఇచ్చింది.  కాకపోతే కొన్ని కండీషన్ల మద్య మద్యం షాపులు ఓపెను చేయొచ్చు అని ప్రకటించింది.  దీంతో  నిన్నటి నుంచి ఏపీలో మద్యం అమ్మకాలు తిరిగి ప్రారంభమైన విషయం తెలిసిందే. లాక్ డౌన్ నిబంధనల కారణంగా సుదీర్ఘ విరామం అనంతరం మద్యం షాపులు తెరుచుకోవడంతో దేశవ్యాప్తంగా కోలాహలం నెలకొంది. ఈ నేపథ్యంలో మద్యం ప్రియులు సోషల్ డిస్టెన్స్‌ను మర్చిపోయారు. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  ఏ మద్యం దుకాణం ముందు చూసినా బారులు తీరిన మందుబాబులే కనిపించారు. మండుటెండలను సైతం లెక్కచేయకుండా మద్యం ప్రియులు దుకాణాల ముందు ఓపిగ్గా ఎదురుచూశారు.

 

ఇక తమ వంతు ఎప్పుడు వస్తుందా అన్నా ఆతృతతో ఒకరినొకరరు తోసుకునే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దాంతో తెనాలి సీఐ హరికృష్ణ కొత్త నిబంధనలు తీసుకువచ్చారు. ఆధార్ కార్డు, గొడుగు ఉంటేనే మద్యం అని స్పష్టం చేశారు.  మద్యం షాపుకు వచ్చేవారు తప్పకుండా గొడుగు తీసుకుని రావాలని రూల్ పెట్టారు. దాని వల్ల ఎండ వేడిమి తట్టుకోవడమే కాదు కనీసం మనిషికి మనిషి ఖచ్చితంగా దూరం పాటించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని అంటున్నారు. ఇక స్థానికేతరులను గుర్తించేందుకు ఆధార్ కార్డు నిబంధన తీసుకువచ్చామని సీఐ వెల్లడించారు. లాక్ డౌన్ ముగిసేవరకు ఇవే నిబంధనలు ఉంటాయని స్పష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: