విశాఖ గ్యాస్ లీకేజ్ ఘటన గురించి ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పందించారు. ఈరోజు వేకువజామున 3.30 గంటల సమయంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుందని చెప్పారు. ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తున్నామని... లీకైన గ్యాస్ అంత ప్రమాదకరం కాదని అన్నారు. లీకైన్ గ్యాస్ వల్ల ఇరిటేషన్ వస్తుందని... శ్వాస సంబంధిత సమస్యలు వస్తాయని పేర్కొన్నారు. నీళ్లు చల్లితే పరిస్థితి అదుపులోకి వస్తుందని చెప్పారు. 
 
ఇప్పటివరకు ఎనిమిది మంది మృతి చెందారని... వీరిలో ఆరుగురు ఊపిరాడక మృతి చెందగా ఇద్దరు కిందపడి చనిపోయారని చెప్పారు. ఫ్యాక్టరీలో విషవాయువులు కంట్రోల్ అయ్యాయని పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చిందని చెప్పారు. గ్రామంలో నీటిని స్ప్రే చేస్తున్నామని డీజీపీ అన్నారు. అయితే ఈ ఘటన ప్రమాదవశాత్తూ జరిగిందా..? లేక ఫ్యాక్టరీ యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల జరిగిందా...? అనే విషయం తెలియాల్సి ఉంది. ఈ గ్యాస్ ను ఎక్కువ మొత్తం పీల్చిన వారికి మాత్రమే ప్రమాదం అని తెలుస్తోంది. విజయవాడలోని కమాండ్ కంట్రోల్ రూం నుంచి డీజీపీ పరిస్థితులను సమీక్షిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: