ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌ను విశాఖ‌లోని ఎల్జీ పాలిమ‌ర్స్ కంపెనీ ప్ర‌తినిధులు కలిశారు. గ్యాస్ బాధితుల‌ను ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ప‌రామ‌ర్శించిన అనంత‌రం ఉన్న‌తాధికారుల‌తో స‌మావేశంలో నిర్వ‌హించి విశాఖ మృతులకు సీఎం జగన్ నష్ట పరిహారాన్ని ప్రకటించారు. అనంత‌రం తిరిగి వెళ్లేందుకు విశాఖ ఎయిర్‌పోర్ట‌కు చేరుకోగా.. అక్క‌డ ఎల్జీ కంపెనీ ప్ర‌తినిధులు ఆయ‌న‌ను క‌లిశారు. ఈ సంద‌ర్భంగా సీఎం జ‌గ‌న్ వారితో మాట్లాడారు. కాగా, అంత‌కుముందు.. అధికారుల‌తో జ‌రిగిన స‌మావేశంలో మృతుల కుటుంబాలకు అన్ని రకాలుగా తోడుగా ఉంటామని భరోసా ఇచ్చారు.

 

ఒక్కో కుటుంబానికి రూ.కోటి ఎక్స్‌గ్రేషియా ఇస్తామని ప్రకటించారు. వెంటిలెటర్‌పై ఉన్న వాళ్లకు రూ.25లక్షలు, ఆస్పత్రుల్లో రెండు మూడు రోజులుండి చికిత్స చేయించుకున్నవారికి రూ.లక్ష ఇస్తామని జగన్ హామీ ఇచ్చారు. ప్రాథమిక చికిత్స చేయించుకున్న వారికి రూ.25 వేలు ఇస్తామన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఏం చేయాలన్న అంశంపై క‌మిటీ అధ్యయనం చేస్తుంద‌ని తెలిపారు. నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని, ప్రమాదం జరిగినప్పుడు అలారమ్‌ మోగాలని, కానీ అలా జరగలేదని జగన్‌ పేర్కొన్నారు. అధికారులు స‌మ‌ర్థ‌వంతంగా ప‌నిచేశార‌ని అన్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: