ఈరోజు ఉదయం విశాఖ నగరంలోని ఎల్జీ పాలిమర్స్ లో గ్యాస్ లీకైన సంగతి తెలిసిందే. ఈ ఘటన మరవక ముందే తమిళనాడు రాష్ట్రంలో మరో ఘటన చోటు చేసుకుంది. తమిళనాడులోని కడలూర్ కోల్ మైనింగ్ కంపెనీలో కోల్ మైనింగ్ కంపెనీలో బాయిలర్ పేలడంతో ఏడుగురు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. నైవేలీ లింగ్టైన్ కార్పొరేషన్ ప్లాంట్‌లో ఈ పేలుడు సంభవించింది. ఘటన జరిగిన వెంటనే ఉన్నతాధికారులు స్పందించి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. 
 
పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితులను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. ఈరోజు ఒక్కరోజే దేశవ్యాప్తంగా మూడు చోట్ల ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. ఏపీలో గ్యాస్ లీకేజ్ ఘటనలో 11 మంది మృతి చెందగా 340 మంది అస్వస్థతకు గురయ్యారు. చత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గఢ్‌లో పేపర్ మిల్లులో ట్యాంక్ శుభ్రం చేస్తుండగా గ్యాస్ లీకై ఏడుగురు కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. వీరి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. 
 
మరికొందరు దేశప్రజలకు 2020 సంవత్సరం కలిసిరాలేదని చెబుతున్నారు. బ్యాడ్ ఇయర్ అని కామెంట్లు చేస్తున్నారు. ఒక వైపు దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తుంటే మరోవైపు ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటూ ఉండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: