ఔరంగాబాద్‌ వద్ద జరిగిన రైలు ప్రమాద ఘటనపై రాష్ట్ర‌ప‌తి రాంనాథ్‌కోవింద్ దిగ్భాంతి వ్య‌క్తం చేశారు. ఈ మేర‌కు ఆయ‌న ట్వీట్ చేశారు. *ఈ దుర్ఘ‌ట‌న మాట‌ల‌కంద‌ని బాధ‌ను మిగిల్చింది. మృతుల కుటుంబాల‌కు నా ప్ర‌గాఢ సానుభూతి తెలుపుతున్నా.. గాయ‌ప‌డిన వారు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని కోర‌కుంటున్నా* అంటూ ట్వీట్ చేశారు. కాగా, మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో ఈ ఘోర‌ రైలు ప్రమాదం సంభవించింది. ఈ తెల్లవారుజామున 5.15 గంటలకు రైలు ఢీకొని 16 మంది వలస కూలీలు మృతిచెందారు. మృతులంతా మధ్యప్రదేశ్‌కు చెందిన వలస కూలీలు. వీరంతా కర్మాడ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని రైల్వే ట్రాక్‌పై నడుచుకుంటూ స్వస్థలాలకు వెళ్తున్నారు.

 

రైళ్లు నడవడం లేదన్న ఆలోచనతో కావచ్చు అలసిన శరీరాలతో కాసేపు విశ్రాంతి తీసుకునేందుకు ట్రాక్‌పైనే నిద్రపోయారు. ఇంత‌లోనే జల్నా-ఔరంగాబాద్‌ మధ్య నడిచే గూడ్స్‌ రైలు వీరు నిద్రిస్తున్న ట్రాక్‌పై నుంచి పోవడంతో కూలీలంతా అక్కడికక్కడే చనిపోయారు. మృతుల్లో పలువురు చిన్నారులు కూడా ఉన్నారు. స్థానిక పోలీసులు, రైల్వే పోలీస్‌ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను చేపట్టారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: