ప్రపంచ దేశాలను కరోనా వైరస్ చిగురుటాకులా వణికిస్తోంది. తాజాగా దక్షిణ కొరియాలో ఒక వ్యక్తి చేసిన పని వల్ల వందాలాది మందికి కరోనా సోకింది. కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొంటున్న దక్షిణ కొరియాలోని సియోల్ నగర సమీపంలో కరోనా సోకిన వ్యక్తి అనేక నైట్ క్లబ్బుల్లో తిరిగాడు. ఈరోజు సియోల్ నగరంలో 34 కేసులు నమోదు కావడంతో విచారణ జరపగా ఒక వ్యక్తి వల్ల వందాలాది మందికి కరోనా సోకిందని తేలింది. 
 
ఈ ఉదంతంతో సియోల్ నగర సమీపంలోని 2300 నైట్ క్లబ్బులు మూతబడ్డాయి. దాదాపు 7000 మంది ఆ వ్యక్తి సంచరించిన నైట్ క్లబ్బులకు హాజరయ్యారని సమాచారం. అధికారులు కరోనా అనుమానితులను క్వారంటైన్ కేంద్రాలకు తరలించి పరీక్షలు జరుపుతున్నారు. ఈ ఘటనతో సియోల్ నగరంలో లాక్ డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నారు. కొత్త కేసులు నమోదు కాకుండా అన్ని రకాల చర్యలు చేపడుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: