క‌రోనా మ‌హ‌మ్మారి మాన‌వాళికి కంటిమీద కునుకులేకుండా చేస్తోంది.  చూస్తుండ‌గానే ప్ర‌పంచాన్ని చుట్టేసి ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. దాదాపుగా 212 దేశాలకు కరోనా వైరస్‌ వ్యాపించింది. ప్రపంచ వ్యాప్తంగా 43.35 లక్షలకు పైగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదుకాగా ఇప్పటి వరకు 2.92 లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ వైరస్‌ నుంచి 15.94 లక్షల మందికి పైగా కోలుకున్నారు. అగ్ర‌రాజ్యం అమెరికాలో మాత్రం క‌రోనా వైర‌స్ విధ్వంసం సృష్టిస్తోంది. అమెరికాలో గత 24 గంటల్లో కొత్తగా 20,685 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 1,467 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు అక్కడ కరోనా కేసుల సంఖ్య 14 లక్షలు దాటింది. అమెరికాలో కరోనా మృతుల సంఖ్య 83,425కు చేరింది.

 

ఆ త‌ర్వాత‌ స్పెయిన్‌లో 26,920 మంది మ‌ర‌ణించారు. యూకేలో 32,692, ఇటలీలో 30,911, ఫ్రాన్స్‌లో 26,991, బ్రెజిల్‌లో 12,404, జర్మనీలో 7,738,  టర్కీలో 3,894, ఇరాన్‌లో 6,733, ఇండియాలో 2,145, కెనడాలో 5,169, బెల్జియంలో 8,761, నెదర్లాండ్స్‌లో 5,510, స్విట్జర్లాండ్‌లో 1,867, స్వీడన్‌లో 3,313, రష్యాలో 2,116 మంది కరోనాతో మ‌ర‌ణించారు. కాగా, భార‌త్‌లో ఇప్ప‌టివ‌ర‌కు 74,292 క‌రోనా పాజిటివ్ కేసులున‌మోదుకాగా 2,415 మంది మ‌ర‌ణించారు. మహారాష్ట్రలో 23,401, గుజరాత్‌లో 8,541, తమిళనాడులో 8,002, ఢిల్లీలో 7233 క‌రోనా కేసులు న‌మోదు అయ్యాయి. క‌రోనా వైర‌స్ ప్ర‌భావం ఎక్కువ‌గా ఉన్న ప్ర‌పంచ దేశాల్లో భార‌త్ 12వ స్థానంలో నిలిచింది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: