కేంద్ర ప్ర‌భుత్వం చేప‌ట్టిన శ్రామిక్ రైళ్ల‌లో వ‌ల‌స కార్మికులు, కూలీలు, విద్యార్థులు, ప‌ర్యాట‌కులు త‌మ స్వ‌స్థలాల‌కు చేరుకుంటున్నారు. అయితే.. ఇప్పుడు అనేక కొత్త చిక్కులు వ‌చ్చిప‌డుతున్నాయి. అనేక‌మంది వ‌ల‌స కార్మికులు క‌రోనా బారిన‌ప‌డుతున్నారు. శ్రామిక్ రైళ్ల‌లో స్వ‌స్థ‌లాల‌కు చేరుకున్న వ‌ల‌స కార్మికుల‌ను అధికారులు క్వారంటైన్‌కు త‌ర‌లించి, క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు చేస్తున్నారు. వారిలో చాలా మంది క‌రోనా వైర‌స్ బారిన‌ప‌డిన‌ట్లు తేలుతుంది. దీంతో అధికావ‌ర్గాలు తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌వుతున్నాయి. వ‌ల‌స కార్మికులు, కూలీలకు వైర‌స్ సోక‌డంతో అనేక రాష్ట్రాల్లో కేసుల సంఖ్య అమాంతంగా పెరుగుతోంది.

 

తాజాగా.. తెలంగాణ నుంచి జార్ఖండ్ రాష్ట్రానికి వెళ్లిన ఓ వ్య‌క్తికి మంగ‌ళ‌వారం అక్క‌డి అధికారులు క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు చేయ‌గా పాజిటివ్ అని వ‌చ్చింది. దీంతో అధికావ‌ర్గాలు తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌వుతున్నాయి. ఈ బాధితుడు రాష్ట్రంలోని లాతేహర్ జిల్లాకు చెందినవాడు. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో ముందుముందు వైర‌స్ మ‌రింత ఎక్కువ‌గా వ్యాప్తి చెందే ప్ర‌మాదం ఉంద‌ని అంటున్నాయి. కాగా, జార్ఖండ్‌లో ఇప్ప‌టివ‌ర‌కు క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 173కు చేరుకుంద‌ని రాష్ట్ర ఆరోగ్య కార్యదర్శి నితిన్ మదన్ కులకర్ణి తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: