కొవిడ్‌-19 మ‌హ‌మ్మారి వ‌ల్ల అనేక రంగాలు కుదేల‌వుతున్నాయి. అనేక‌ వ్యాపారాలు  దెబ్బ‌తింటున్నాయి. ఈ నేప‌థ్యంలో కొన్ని సంస్థ‌లు ఉద్యోగుల్ని తొల‌గిస్తున్నాయి. మ‌రికొన్ని సంస్థ‌లు జీతాల్లో కోత‌లు పెడుతున్నాయి. తాజాగా ఫుడ్ డెలివ‌రీ సంస్థ స్విగ్గీ కూడా ఉద్యోగుల్ని తొల‌గించ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది. సుమారు 1100 మంది ఉద్యోగులను కొన్ని రోజుల పాటు దూరంగా పెట్ట‌నున్న‌ట్లు పేర్కొన్న‌ది. ప్ర‌మాద‌క‌రంగా మారిన వ్యాపారాల‌ను మూసివేసేందుకు స్విగ్గీ సిద్ధ‌మైన‌ట్లు తెలుస్తోంది.

 

స్విగ్గీలో ఉద్యోగుల సంఖ్య‌ను త‌గ్గించ‌డం ప‌ట్ల సీఈవో శ్రీహ‌ర్ష స్పందించారు.  స్విగ్గీకి ఇది చీక‌టి రోజు అని అన్నారు. రానున్న కొన్ని రోజుల్లో వివిధ హోదాల్లో ఉన్న 1100 మందిని తొల‌గించిన‌ట్లు ఆయ‌న తెలిపారు. వారం క్రిత‌మే జొమాటో కూడా 13 శాతం మంది ఉద్యోగుల‌పై వేటు వేసింది. మిగితా ఉద్యోగుల‌పై సుమారు 50 శాతం జీతం కోత విధించింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: