గత కొన్ని రోజుల నుంచి తెలంగాణ రాష్ట్రంలో బస్సు ఛార్జీలను పెంచే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. తెలంగాణ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈరోజు ఉదయం ఆరు గంటల నుంచే బస్సులు రోడ్లెక్కాయి. మే 31వ తేదీ వరకు జిల్లాల్లో మాత్రమే బస్సులు తిరగనున్నాయి. అయితే బస్సులో పరిమిత సంఖ్యలో మాత్రమే ప్రయాణికులకు అనుమతులు ఇవ్వడంతో ఛార్జీలు పెంచే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. 
 
అయితే ఈ వార్తలపై తెలంగాణ సర్కార్ స్పందించింది. రాష్ట్రంలో ప్రస్తుతానికైతే పాత ఛార్జీలే అమలవుతాయని తెలుస్తోంది. భవిష్యత్తులో మాత్రం ఛార్జీలు పెంచే అవకాశాలు ఉన్నాయని సమాచారం. సీఎం కేసీఆర్ నిన్న ప్రెస్ మీట్లో బస్సు ఛార్జీల గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. దీంతో ఛార్జీలు పెంచే అవకాశాలు లేవని సమాచారం అందుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: