ఒకటి కాదు రెండు కాదు లక్ష దాటిన కేసులు.  మొన్నటి వరకు సీరియస్ గా లాక్ డౌన్ పాటించారు ప్రజలు.  కానీ ఎప్పుడైతే సడలింపు వచ్చిందో రోడ్లపై విచ్చలవిడిగా తిరగడం మొదలు పెట్టారు. ఫలితంగా మళ్లీ కేసులు గతంలో కన్నా డబుల్ పెరగడం మొదలు పెట్టాయని నిపుణులు అంటున్నారు.  భారత దేశంలో  కరోనా మహమ్మారి మరింతగా విజృంభించింది. వైరస్ కేసులు వెలుగులోకి వచ్చిన తరువాత, తొలిసారిగా, 24 గంటల వ్యవధిలో 5,600కు పైగా కేసులు నమోదయ్యాయి. మంగళవారం నాడు దేశవ్యాప్తంగా 5,611 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, ఇదే సమయంలో 140 మంది ప్రాణాలు వదిలారని కేంద్ర ఆరోగ్య శాఖ అధికారికంగా ప్రకటించింది.  ముఖ్యంగా ముంబాయి లో కరోనా కరాళ నృత్యం చేస్తుంది.  

 

ఆ తర్వాత రాజస్థాన్, తమిళనాడు లో బీభత్సం సృష్టిస్తుంది.  మొత్తం కేసుల సంఖ్య 1,06,750కి పెరిగాయని, ప్రస్తుతం 61,149 మందికి వివిధ ఆసుపత్రుల్లో చికిత్స జరుగుతోందని పేర్కొంది. ఇప్పటివరకూ 3,303 మంది వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోయారని వెల్లడించింది. నిన్న 3,124 మంది రికవరీ కాగా, మొత్తం డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 42,297కు పెరిగింది. రికవరీ రేటు 39.62 శాతానికి మెరుగుపడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: