క‌రోనా వైర‌స్ క‌ట్ట‌డికి కొన‌సాగుతున్న లాక్‌డౌన్ నుంచి స‌డ‌లింపులు ల‌భిస్తుండ‌డంతో అనేక రంగాల కార్య‌క‌లాపాలు క్ర‌మంగా ప్రారంభం అవుతున్నాయి. ఇప్ప‌టికే ప్ర‌జార‌వాణాకు సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వాలు కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నాయి. ఇక‌ ఈనెల 25 నుంచి దేశీయ పౌర విమాన సర్వీసులు విడతల వారీగా ప్రారంభంకానున్నాయి.  విమాన కార్యకలాపాలకు సిద్ధంగా ఉండాలని అన్ని ఎయిర్‌లైన్స్‌, ఎయిర్‌పోర్టులకు పౌర విమానయానశాఖ సూచించింది.

 

ఈ నేపథ్యంలో కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. ప్రయాణికుల భద్రత, తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై పౌరవిమానయాన శాఖ ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేస్తుందని కేంద్ర మంత్రి హర్‌దీప్‌ సింగ్‌ పూరి తెలిపారు.  ప్రతి విమానంలో పరిమిత స్థాయిలో ప్రయాణికులను అనుమతించనున్నారు. భౌతిక దూరం తప్పకుండా పాటించేలా సీట్లను కేటాయించనున్నారు. కరోనా కారణంగా దేశవ్యాప్తంగా గత మార్చిలో విమాన సర్వీసులు నిలిచిపోయిన విష‌యం తెలిసిందే. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: