ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి ఉద్యోగులకు శుభవార్త చెప్పారు. ఈ నెల నుంచి ఉద్యోగులకు పూర్తి జీతాలు చెల్లిస్తామని తెలిపారు. కేంద్రం మార్చి నెల చివరి వారం లాక్ డౌన్ విధించడంతో ఏపీ ప్రభుత్వం గత రెండు నెలలు ఉద్యోగులకు సగం జీతం మాత్రమే చెల్లించింది. మిగతా సగం జీతాలను భవిష్యత్తులో చెల్లిస్తామని పేర్కొంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేశారు. 
 
సీఎం జగన్ గత రెండు నెలల బకాయిల గురించి కూడా త్వరలో నిర్ణయం తీసుకుంటానని చెప్పినట్టు తెలుస్తోంది. ప్రభుత్వం జీతాల్లో కోత పెట్టడంపై హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై విచారణ జరగనుంది. నాలుగో విడత లాక్ డౌన్ లో భాగంగా రాష్ట్రంలో వ్యాపార, వాణిజ్య సేవలకు గ్రీన్ సిగ్నల్ లభించడంతో రాష్ట్రంలో ఆర్థికంగా కోలుకుంటోంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడటంతో జగన్ సర్కార్ పూర్తి జీతాలు చెల్లించటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: