ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొద్ది రోజుల నుంచి కరెంట్ బిల్లుల గురించి విపరీతంగా చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ట్విట్టర్ ద్వారా కరెంట్ బిల్లుల గురించి స్పందించారు. సీఎం జగన్ నూతనంగా అమలులోకి తెచ్చిన డైనమిక్ విధానం వల్లే కరెంట్ బిల్లులు పెరిగాయని అన్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు రెండు నెలలుగా ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారని... ఇలాంటి సమయంలో ప్రభుత్వం వాళ్ల బాధను ఆలకించాలని చెప్పారు. 
 
సీఎం జగన్ ప్రజల గురించి సగటు వినియోగదారుడి కోణంలో ఆలోచించాలని అన్నారు. ప్రభుత్వమే మూడు నెలల విద్యుత్ బిల్లులను చెల్లించాలని డిమాండ్ చేశారు. కరోనా విపత్తులో భాగంగానే విద్యుత్ బిల్లులను చూడాలని సూచించారు. విపత్తు నిర్వహణ నిధుల ద్వారా ప్రభుత్వం వారిని ఆదుకోవాలని కోరారు. గంటా వ్యాఖ్యలపై వైసీపీ నేతలు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: