కరోనా వైరస్ కల్లోలం నుంచి కాస్త రిలాక్స్ అయ్యేందుకు మేఘాలయా ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా తనలో దాగిన సంగీత కళను మరోసారి ప్రదర్శించారు. ఎలక్ట్రిక్ గిటార్‌పై కొన్ని బాణీలు వినిపించిన ఆయన రాక్‌స్టార్‌లా మారి అదరగొట్టారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత.. సీఎం సంగ్మా సేద తీరేందుకు తన ఎలక్ట్రిక్ గిటార్‌ను బయటకు తీసి.. ఐరన్ మైడెన్ బ్యాండ్‌కు సంబంధించిన వేస్టెడ్ ఇయర్స్ ట్యూన్‌ని అద్భుతంగా వినిపించారాయన.
1986లో రిలీజైన సమ్‌వేర్ ఇన్ టైమ్ ఆల్బమ్‌లోని పాటను తన గిటార్‌తో వాయించారు. ఇక్కడ విషయం ఏమిటంటే.. సీఎం తన గిటార్ వీడియోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేయగానే దాన్ని కొన్ని గంటల్లోనే సుమారు 3 లక్షల మంది చూడడం గమనార్హం. మీరు కూడా ఓ లుక్కేసుకోండి.
View this post on InstagramAfter a hectic 3 day assembly session .. unwinding with some iron maiden stuff .. it’s been a long while I haven’t played so I guess a few mistakes ...