సాధారణంగా కోడిగుడ్డలో పసుపుపచ్చ సొన ఉంటుంది. కానీ.. కేరళలోని మలప్పురంలో ఆకుపచ్చ సొన ఉన్న కోడిగుడ్లు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. సామాన్యులతోపాటు సైంటిస్టుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఒతుక్కుంగల్లోని ఏకే షిహాబుద్దీన్ అనే రైతు వద్ద ఉన్న కోళ్లలో ఆరు కోళ్లు కొంతకాలంగా ఆకుపచ్చ సొన ఉన్న గుడ్డు పెడుతున్నాయి. ఈ విషయం కాస్త శాస్త్రవేత్తలకు తెలిసింది.
రాష్ట్రంలోని కేవీఏఎస్యూ శాస్త్రవేత్తలు వెంటనే అక్కడికి చేరుకుని ఈ గుడ్లను పరిశీలించారు. గుడ్డులో ఆకుపచ్చ సొన ఎందుకు ఏర్పడింతో తెలుసుకునేందుకు మూడు వారాలు పడుతుందని అసిస్టెంట్ ప్రొఫెసర్ హరికృష్ణన్ తెలిపారు.