ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా కేసులు ఇప్పుడు మరింతగా విజృంభిస్తుంది.   ఆదివారం నుంచి సోమవారం ఉదయం వరకు గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 6,566 కొత్త కేసులు నమోదయ్యాయి. గంటలకు సగటును 282 కేసులు నిర్ధారణ అవుతున్నాయి. పాజిటివ్ కేసుల వరుసగా నాలుగు రోజు 6వేలు దాటడం గమనార్హం. దేశవ్యాప్తంగా కరోనాతో మరో 153 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో కోవిడ్-19 మరణాలు 4,053కి చేరాయి.  చైనాలోని పుహాన్ లో పుట్టుకొచ్చిన  మాయదారి మహమ్మారి ప్రపంచాన్ని ఒక్క కుదుపు కుదిపేసింది.  ఈ నేపథ్యంలో జ‌పాన్ ఒకదశలో కేసులు పెరిగిపోతున్న సమయంలో ఎమ‌ర్జెన్సీ ప్రకటించారు.  తాజాగా దేశ‌వ్యాప్తంగా విధించిన ఎమ‌ర్జెన్సీని జ‌పాన్ ప్ర‌ధాని షింజో అబే ఎత్తేశారు.

 

ఇవాళ జాతిని ఉద్దేశించి ఆయ‌న టీవీలో ప్ర‌సంగించారు. చాలా క‌ట్టుదిట్ట‌మైన ప్ర‌ణాళిక‌తో ఎమ‌ర్జెన్సీ ఆంక్ష‌ల‌ను స‌డ‌లిస్తున్న‌ట్లు ఆయ‌న తెలిపారు.  రాజ‌ధాని టోక్యోలో నిబంధ‌న‌లు సుల‌భ‌త‌రం కానున్నాయి.  కరోనా కేసులు మరింతగా పెరిగిపోతున్న సమయంలో ఏప్రిల్ 7వ తేదీన ఇచ్చిన ఆదేశాల‌తో దేశంలోని కొన్ని ప్రాంతాల్లో కోవిడ్ నియంత్ర‌ణ కోసం చ‌ర్య‌లు తీసుకున్న‌ట్లు చెప్పారు. అయితే మే నెల రెండ‌వ వారం నుంచి స్వ‌ల్పంగా ఆంక్ష‌ల‌ను జ‌పాన్ స‌డ‌లిస్తున్న‌ది.  ఇదిలా ఉంటే జపాన్ లో 16550 వైర‌స్ పాజిటివ్ కేసులు న‌మోదు కాగా,  820 మంది మ‌ర‌ణించారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: