ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి మన పాలన మీ సూచన సదస్సులో భాగంగా ఈరోజు సదస్సు నిర్వహించారు. సీఎం జగన్ మాట్లాడుతూ కరోనా విజృంభణ నేపథ్యంలో వైయస్సార్ టెలీమెడిసిన్ ను ఏర్పాటు చేశామని అన్నారు. రాష్ట్రంలో 1060 కొత్త ఆంబులెన్స్ లను అందుబాటులోకి తీసుకొస్తున్నామని అన్నారు. కోవిడ్ సమయంలో ఆరోగ్య రంగంపై ప్రత్యేక దృష్టి పెట్టామని... ప్రజల వైద్యం అవసరాల కోసం టెలీమెడిసిన్ కు శ్రీకారం చుట్టామని అన్నారు. 
 
ఎవరికైనా ఆరోగ్యం బాగా లేకపోతే 14410 నంబర్ కు మిస్డ్ కాల్ ఇచ్చిన వెంటనే వైద్యులు ఫోన్ చేసి.. వాడాల్సిన మందులు సూచిస్తారని... తరువాత రోజు మందులు ఇంటికి డెలివరీ అవుతాయని అన్నారు. ఆంబులెన్స్ లతో పాటు బైక్ లను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ప్రతి 2,000 జనాభాకు వైయస్సార్ విలేజ్ క్లినిక్ లను ఏర్పాటు చేస్తున్నామని సీఎం అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: