సాధారణంగా వేసవికాలంలో ఆవకాయ పచ్చడి పెట్టుకుంటూ ఉంటారనే సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ ఆవకాయ పచ్చడే తెలంగాణలోని ఊరిని ప్రమాదంలోకి నెట్టింది. రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లా నవాబుపేట మండలంలోని కొల్లూరుకు చెందిన ఓ ప్రజాప్రతినిధి లాక్ డౌన్ సమయంలో ఊరందరికీ ఆవకాయ పచ్చడి పంచాలనుకున్నాడు. షాద్‌‌‌‌నగర్‌కి చెందిన తన బంధువైన వ్యాపారిని ఊరందరికీ పచ్చడి సఫ్లై చేసేలా ఒప్పందం చేసుకున్నాడు. 
 
ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులు 12 మంది సమక్షంలో 2 క్వింటాళ్ల పచ్చడి తయారు చేశారు. 12 మంది ఆ పచ్చడిని రుచి చూసి అక్కడే ఉప్మా వండించుకుని పచ్చడి తిన్నారు. అయితే మరోసటి రోజు పచ్చడి తయారు చేసిన ఇద్దరికి కరోనా నిర్ధారణ అయింది. అప్పటికే 12 మంది పచ్చడికి ఊరంతా పంచేశారు. దీంతో గ్రామంలోని 4000 మంది భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే 100 మంది హోం క్వారంటైన్ కు పరిమితమయ్యారు. గ్రామస్తులు మామిడి పచ్చడిని డంప్ యార్డులో పడేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: