ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిమ్మగడ్డ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతున్న సంగతి తెలిసిందే. హైకోర్టు ఉత్తర్వులతో నిమ్మగడ్డ రమేష్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా తిరిగి బాధ్యతలు చేపట్టగా ఆయన నియామకం చెల్లదంటూ నిన్న అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ వ్యాఖ్యలు చేశారు. అనంతరం ఎన్నికల కమిషనర్ గా బాధ్యతల స్వీకరణకు సంబంధించి జారీ చేసిన ఉత్తర్వులను వెనక్కు తీసుకున్నట్టు తీసుకుంటున్నట్లు ఎస్‌ఈసీ కార్యదర్శి శనివారం అర్ధరాత్రి ప్రకటన చేశారు. 
 
అయితే 1996 బ్యాచ్‌కు చెందిన జి.వాణీమోహన్‌ను ఏపీ ఎన్నికల కమిషన్‌ కార్యదర్శిగా నియమిస్తూ అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ అయ్యాయి. గతంలో ఆమె సహకారశాఖ కమిషనర్‌ గా పని చేశారు. ఎన్నికల కార్యదర్శితో పాటు అదనపు బాధ్యతలు అప్పగిస్తున్నట్టు సీఎస్ నీలం సాహ్ని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రభుత్వం ఎన్నికల కార్యదర్శిగా వాణీమోహన్ ను నియమించడం చర్చకు దారి తీస్తోంది. నిమ్మగడ్డ వ్యవహారం కీలక మలుపులు తీసుకుంటున్న తరుణంలో ప్రభుత్వం వాణీమోహన్ ను ఎన్నికల కార్యదర్శిగా నియమించడం గమనార్హం. 

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: