ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ శరవేగంగా విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తాజాగా రాష్ట్రంలో గ్రామ వాలంటీర్ కు కరోనా నిర్ధారణ అయింది. వాలంటీర్ కు కరోనా నిర్ధారణ కావడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని వాలంటీర్‌కు కరోనా టెస్ట్ చేయగా పాజిటివ్ నిర్ధారణ కావడంతో వాలంటీర్ కుటుంబ సభ్యులకు కూడా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. 
 
వాలంటీర్ కు కరోనా కరోనా నిర్ధారణ కావడంతో వాలంటీర్ కు కేటాయించిన కుటుంబాలలోని ప్రజలు, ఇతర వాలంటీర్లు కూడా భయాందోళనకు గురవుతున్నారు. మరోవైపు రాష్ట్రంలో ఈరోజు 98 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 3,377కి చేరింది. గడచిన 24 గంటల్లో ముగ్గురు కరోనా భారీన పడి మృతి చెందగా మృతుల సంఖ్య 71కి చేరింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: