లాక్ డౌన్ వల్ల ఆర్థికంగా నష్టపోయిన తెలుగు రాష్ట్రాలకు కేంద్రం శుభవార్త చెప్పింది. కేంద్ర ప్రభుత్వం తెలుగు రాష్ట్రాలకు జీఎస్టీ బకాయిలను విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ కు 681 కోట్ల రూపాయలు విడుదల చేసిన కేంద్రం, తెలంగాణకు 522 కోట్ల రూపాయలు విడుదల చేసింది. రాష్ట్రాల రెవిన్యూ లోటు భర్తీ కొరకు కేంద్రం బకాయిలను విడుదల చేసినట్టు తెలుస్తోంది. గత కొన్ని నెలల నుంచి బకాయిలు చెల్లించకపోవడంపై రాష్ట్రాల నుంచి అసంతృప్తి వ్యక్తమైంది. 
 
మరోవైపు లాక్ డౌన్ వల్ల ఆదాయం లేక రాష్ట్రాలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాయి. దీంతో కేంద్రం ఈ బకాయిలు విడుదల చేయడం గమనార్హం. జీఎస్టీ అమలు తర్వాత కలిగే రెవెన్యూ లోటును ఐదేళ్ల పాటు రాష్ట్రాలకు కేంద్రం భర్తీ చేయాలని జీఎస్టీ చట్టం చెబుతోంది. 2017 జులై1వ తేదీన జీఎస్టీ అమల్లోకి వచ్చింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: