ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ రాష్ట్ర ప్రజలకు మరో శుభవార్త చెప్పింది. నిరుపేదలకు సొంత ఇంటి కలను సాకారం చేసేందుకు సీఎం జగన్ వైయస్ రాజశేఖ రెడ్డి పుట్టిన రోజైన జులై 8వ తేదీన 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలను పంపిణీ చేయనున్నట్లు చెప్పిన సంగతి తెలిసిందే. తాజాగా జగన్ సర్కార్ వీరికి మరో శుభవార్త చెప్పింది. వీరికి ఇళ్లు నిర్మించేందుకు ఆగష్టు 14న శంకుస్థాపన కార్యక్రమం జరగనుందని ప్రభుత్వం నుంచి ప్రకటన వెలువడింది. 
 
సీఎం జగన్ రాష్ట్రంలో 2023 నాటికి 30 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం ఇళ్ల పట్టాల పంపిణీ కోసం 25,842 ఎకరాల ప్రభుత్వ, 16,078 ఎకరాల ప్రైవేట్ భూములను వినియోగించనున్నట్లు మంత్రి కన్నబాబు మీడియాకు తెలిపారు. ప్రభుత్వం మహిళల పేర్లపై ఇళ్ల పట్టాలను రిజిస్ట్రేషన్ చేసి వారికి పంపిణీ చేయనుంది. 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: