సీఎం కేసీఆర్ ఈరోజు రాష్ట్రంలో వాయిదా పడిన పదవ తరగతి పరీక్షలు, కరోనా వ్యాప్తి నివారణ, లాక్‌డౌన్ తదితర అంశాలపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. సీఎం ఈ సమీక్షలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారని తెలుస్తోంది. మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్‌లో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఉన్నతాధికారులతో సీఎం చర్చించనున్నారు. 
 
రాష్ట్రంలో వేలాదిమంది ఎదురు చూస్తున్న పదో తరగతి పరీక్షల గురించి స్పష్టత రానుంది. సీఎం కేసీఆర్ పదో తరగతి పరీక్షలను రద్దు చేసే దిశగా ప్రయత్నాలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అధికారులు అందరినీ పాస్ చేసే ప్రతిపాదనను తెరపైకి తీసుకొస్తున్నారని తెలుస్తోంది. విద్యార్థుల ఇంటర్నల్ మార్కుల ఆధారంగా ఫలితాలను ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: