ఏపీలో డాక్టర్ సుధాకర్ ఘటన మరవక ముందే మరో మహిళా డాక్టర్ వివాదం తెరపైకి వచ్చింది. చిత్తూరులో వైసీపీ నేతలు తనపై దాడి చేశారని అనితారాణి అనే డాక్టర్ ఫిర్యాదు చేశారు. చిత్తూరు జిల్లా పెనుమూరులో డాక్టర్ గా విధులు నిర్వహిస్తున్న అనితారాణి పోలీసులకు ఫిర్యాదు చేసినా అధికార పార్టీ నేతలపై కేసు నమోదు చేయడం లేదని చెబుతున్నారు. ఈ ఘటనలో వైసీపీని విమర్శిస్తూ మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ ట్వీట్ చేశారు. 
 
గోల్డ్ మెడల్ సాధించి డాక్టర్ అయిన ఒక దళిత బిడ్డ పై వైకాపా గుండాల దాష్టీకం జరుగుతోందని.... జగన్ గారు అమలు చేస్తున్న రాజా రెడ్డి రాజ్యాంగంలో దళిత బిడ్డలకు రక్షణ లేకుండా పోయిందని... వైకాపా నాయకుల అవినీతికి సహకరించలేదని దళిత మహిళా డాక్టర్ అనితా రాణి గారిని వేధించడం దారుణం అని ట్విట్టర్ పోస్ట్ చేశారు. జగన్ గారూ! మీ దిశ చట్టం దిశ తప్పిందా? అన్యాయం జరిగింది అంటూ ఒక దళిత చెల్లెలు పోలీస్ స్టేషన్ కి వెళితే దిశ చట్టం నిందితులకు కొమ్ముకాయడం నేరం అంటూ విమర్శలు చేశారు. 


 

మరింత సమాచారం తెలుసుకోండి: