అతను ప్రభుత్వ ఆఫీసులో అటెండర్. కానీ కలెక్టర్ సంతకాన్నే ఫోర్జరీ చేయగలడు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి దేవదాయ శాఖలో ధర్మారావు అనే వ్యక్తి అటెండర్ గా పని చేస్తున్నాడు. అతని నెల వేతనం 5,000 రూపాయలు. నందిగాం, మెళియాపుట్టి ప్రాంతాల్లో ఉన్న శ్రీలక్ష్మీనృసింహస్వామి దేవస్థానం భూముల విక్రయాలపై ధర్మారావు కన్నేశాడు. ఆ భూములను ఎలాగైనా కొట్టేయాలని పథకం రచించాడు. నకిలీ పత్రాలపై కలెక్టర్ సంతకాలు, దేవదాయ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ పేరుతో ఉన్న సీలు, తహసీల్దారు సంతకాలను ఫోర్జరీ చేసి కొంత మంది వ్యక్తులకు అమ్మేశాడు. 
 
భూములు అమ్మినా అవి నకీలీ పత్రాలు కావడం వల్ల ఎవరికీ అనుమానం రాలేదు. కొంత మంది వ్యక్తులు ధర్మారావు కోసం తరచూ కార్యాలయానికి వస్తుండడంతో ఈవో వీవీఎస్‌ నారాయణకు అనుమానం వచ్చి దర్యాప్తు చేపట్టగా అసలు నిజం తెలిసింది. ధర్మారావు 10 మందికి పట్టాలను విక్రయించి సుమారు రూ. 1.40 లక్షలు వసూలు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. టెక్కలి పోలీసులు ధర్మారావుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: